: రాష్ట్రంలో చౌకధరల డిపో డీలర్లకు కమిషన్ పెంపు
రాష్ట్రంలో చౌక ధరల డిపో డీలర్లకు కమిషన్ ను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఆ దస్త్రంపై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతకం చేశారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దాంతో, బియ్యంపై కిలోకు పది పైసలు, పంచదారపై 42 పైసలు, కందిపప్పుపై 45 పైసలు, గోధుమలపై 87 పైసలు కమిషన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.