రాష్ట్ర బడ్జెట్ ను సోమవారం ఉదయం 10.26కు శాసనసభలో ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈసారిబడ్జెట్ ను తాను, మంత్రి సి.రామచంద్రయ్య కలిసి సమర్పించనున్నట్టు చెప్పారు. ఇదే బడ్జెట్ ను శాసన మండలిలో మంత్రి శీధర్ బాబు ప్రవేశపెడతారన్నారు.కాగా, వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నా లక్మీ నారాయణ సభలో ప్రవేశపెట్టనున్నారని వెల్లడించారు.
మార్చి 26న ఓటాన్ అకౌంట్ ను మంజూరు చేయించుకుంటామని తెలిపారు. ఈ బడ్జెట్ లోనూ రాయితీలను కొనసాగిస్తామని ఆనంచెప్పారు.ఎస్సీ, ఎస్టీ చట్టానికి అనుగుణంగా 22.8 శాతం నిధులు దళిత, గిరిజన వర్గానికి ఖర్చు చేసేలా బడ్జెట్ రూపొందించినట్లు మంత్రితెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే ప్రజల అవసరాలను తీర్చే విధంగా బడ్జెట్ ను తీర్చిదిద్దామని వివరించారు.