: ఫిబ్రవరి 2న జరిగే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి


గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పోస్టులకు ఫిబ్రవరి 2వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నట్లు, పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇవాళ (సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఆర్వో పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్ష జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పరీక్షల ప్రాథమిక కీ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇప్పటి వరకు వీఆర్వో పోస్టులకు 13,13,302 మంది, వీఆర్ఏ పోస్టులకు 62,786 మంది దరఖాస్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను www.ccla.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి పరీక్షకు గంట సమయం ముందువరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ నియామకపు పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తోందని అన్నారు. గతంలో కేవలం తెలుగు మాధ్యమంలోనే పరీక్ష జరిగేదని, అయితే, ఈసారి ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మీడియాలలో కూడా పరీక్షను నిర్వహిస్తున్నామని సిసిఎల్ఎ కార్యదర్శి ఎ. సూర్యకుమారి చెప్పారు. ప్రశ్నాపత్రం ద్విభాషలో ఉంటుందని, ఇంగ్లీషు మాత్రం కామన్ గా ఉంటుందని ఆమె అన్నారు. హాల్ టిక్కెట్ల డౌన్ లోడింగ్, పరీక్షకు సంబంధించిన ఏవైనా సందేహాలుంటే, 040-23120118 హెల్ప్ లైన్ నెంబరును సంప్రదించవచ్చని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News