: ఎమ్మెల్సీల ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత: దాడి


శాసనమండలిలో భద్రత ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయని ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. ఉగ్రవాదులెవరైనా చొరబడినా దిక్కులేదని ఆయన వాపోయారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీల ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. హైదరాబాద్ జంట పేలుళ్ల అనంతరం శాసనసభకు దారితీసే మార్గంలో పటిష్ట భద్రత కల్పించిన ప్రభుత్వం శాసనమండలిని చిన్నచూపు చూస్తోందని తెలిపారు. 

  • Loading...

More Telugu News