: సాధారణ జీవితం గడపాలనుకుంటున్నా: మాజీ మావోయిస్టు ఉసెండి
అనారోగ్యం కారణంగానే తాను పోలీసులకు లొంగిపోయానని మావోయిస్టు మాజీ నేత ఉసెండి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, మావోయిస్టు పార్టీలో ఉన్న విభేదాలు కూడా తన లొంగుబాటుకు కారణమని అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై పార్టీ అతిగా స్పందించకుండా ఉండడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణ జీవితం గడపాలని తాను బలంగా కోరుకుంటున్నానని ఉసెండి స్పష్టం చేశారు.