: శాసనసభ రేపటికి వాయిదా
అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. డిప్యూటీ స్పీకర్ ఎంత వారించినప్పటికీ శాసనసభ్యులు శాంతించలేదు. కాగా, అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉందని, సభను రేపటికి వాయిదా వేయాలని మంత్రి రఘువీరారెడ్డి కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు బట్టివిక్రమార్క సభను రేపటికి వాయిదా వేశారు.