: నేను అభివృద్ధిని ప్రశ్నిస్తున్నా: అక్బరుద్దీన్ ఒవైసీ
తాను రాయలసీమ, కోస్తాంధ్రల వెనుకబాటుతనాన్ని ప్రశ్నిస్తున్నానని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తనకు 5 ఏళ్లు అధికారం ఇస్తే తాను అభివృద్ధి చేసి చూపిస్తానని సవాలు విసిరారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల వెనుకబాటుతనానికి కారణం అక్కడి నేతల తీరేనని ఆయన దుయ్యబట్టారు.