: రాష్ట్రపతికి లేఖ రాయాలని టీ మంత్రుల నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై గడువు పెంచవద్దని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయాలని తెలంగాణ ప్రాంత మంత్రులు నిర్ణయించినట్లు సమాచారం. ఆ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్రానికి పంపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన 23 రోజుల సమయంలో శాసనసభలో కొంతమంది నేతలు చర్చించారు. ఇంకా మరికొంతమంది మాట్లాడాల్సి ఉంది. బిల్లుపై సమగ్ర చర్చ జరగాల్సి ఉన్న నేపథ్యంలో సమయం పెంచాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారం.