: చాక్లెట్ ఉంటే.. డయాబెటిస్ ఉండదు!


మధుమేహం మాట చెబితే భయపడేవారికి తియ్యటి కబురు. ముందు ఒక చాక్లెట్ కొనుక్కొని నోట్లో వేసుకోండి. అంతే, డయాబెటిస్ మీకు దూరంగా పారిపోతుంది. చాక్లెట్లు, రెడ్ వైన్ లో ఉండే ఆంతోసియానిన్స్ తోపాటు ఇతర ఫ్లావనాయిడ్స్ టైప్ 2 డయాబెటిస్ నుంచి రక్షణ ఇస్తాయని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, కింగ్స్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఈ ఫ్లావనాయిడ్స్ బెర్రీలో, టీలోనూ ఉంటాయట. వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. రెండు వేల మందిపై పరిశోధన చేసి వారు ఈ ఫలితాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News