: బిలియనీర్ల జాబితాలో భారత్ కు ఐదోస్థానం


ప్రపంచంలో అత్యధికంగా బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ టాప్ ఫైవ్ లో నిలిచింది. మొత్తం 122 మంది బిలియనీర్లతో భారత్ ఐదోస్థానం దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా  అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఈ జాబితాలో అమెరికా, యూరోపియన్ యూనియన్ లు తొలి రెండు స్థానాల్లో నిలవగా.. ఆసియా ఆర్ధిక శక్తులు చైనా, జపాన్ ఆ తర్వాతి స్థానాలు కైవసం చేసుకున్నాయి. రూ. 500 కోట్ల నెట్ వర్త్ విలువకు ఎగువన ఉన్న వ్యక్తులను ఈ జాబితాకు అర్హులుగా పరిగణించారు. కాగా, సంపన్న నగరాల్లో ముంబయికి ఏడోస్థానం, ఢిల్లీకి 11వ స్థానం దక్కాయి. 

  • Loading...

More Telugu News