: విభజన బిల్లు అసమగ్రంగా ఉంది: వెంకయ్యనాయుడు


దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన సీమాంధ్ర నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, విభజన జరిగే సమయంలో.. సీమాంధ్ర వాసుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల వారికి మేలు కలిగే విధంగానే రాష్ట్ర విభజన జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సూత్రాన్ని ఇంతకు ముందే బీజేపీ మూడు రాష్ట్రాల విభజన విషయంలోనూ అనుసరించిందని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని ఆయన అన్నారు. విభజన విషయంలో ఇక్కడ సోనియా అవునంటే.. అక్కడ రాష్ట్రంలో బొత్స కాదంటారని ఆయన చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, కేంద్రం తాము చేసిన పొరపాటును గుర్తించాలని ఆయన హితవు పలికారు. విభజన బిల్లును కేంద్రం సమగ్రంగా రూపొందించలేదని ఆయన అన్నారు. విభజన బిల్లుపై తెలంగాణ వాసుల్లోనూ కొన్ని అనుమానాలున్నాయని ఆయన చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో ఈ విధమైన విభజన ప్రక్రియ ఎన్నడూ జరగలేదని వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమస్యలను పరిష్కరించే విధంగానే విభజన జరగాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News