: బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు: హీరో తారక్


నటుడు బాలకృష్ణ త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని హీరో నందమూరి తారకరత్న తెలిపారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని, బోనకల్ మండలాల్లో నిన్న (ఆదివారం) తారక్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళతామని వెల్లడించారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ టీడీపీకి అండగా ఉంటుందని చెప్పిన తారక్, మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించటం, ప్రజల వద్దకు పరిపాలన వంటి ఎజెండాలతో ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు వివరించారు.

  • Loading...

More Telugu News