: కొత్త పోప్ ... పాత ప్రేమకథ!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది క్యాథలిక్కులకు ఆరాధ్యుడు పోప్ అన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యవహారశైలి అనుక్షణం నిశిత పరిశీలనకు గురవుతూ ఉంటుంది. ఆయన ఏం చేసినా అది వార్తే అవుతుంది. కొత్త పోప్ గా ఎన్నికైన మారియో బెరాగ్లియో అందుకు మినహాయింపు కాదు. అయితే, ప్రస్తుతం సహనశీలి, వినయశీలి, బుద్ధిమంతుడు అని పేరు తెచ్చుకున్న బెరాగ్లియో బాల్యంలో మహాముదురట.
ఎంతంటే, పన్నెండేళ్ల వయసులోనే పక్కింటమ్మాయికి ప్రేమలేఖ రాసేటంత! ఇప్పడా అమ్మాయి వయస్సు 76..! పేరు అమాలియో డామోంటే. ఉండేది పోప్ స్వస్థలమైన బ్యూనస్ ఎయిర్స్ లోనే. అంతటి చిరు ప్రాయంలోనే పోప్ మహాశయుడు ఆ లేఖలో ఏం రాశాడో తెలుసా.. ? 'మనిద్దరం ఒకటైన తర్వాత ఈ భవంతి నీకోసమే కొంటాను' అని ఆ లేఖలోనే ఓ పెద్ద సౌధాన్ని చిత్రించాడట.
బెరాగ్లియో.. పోప్ ఫ్రాన్సిస్ గా మారిన తర్వాత ఈ విషయాన్ని డామోంటే ఇటీవలే వెల్లడించింది. అయితే, పోప్ చాలా నిజాయతీపరుడని ఆమె కితాబిస్తోంది. ఒకవేళ పెళ్లి చేసుకోకుంటే, మతగురువు అవుతానని ఆయన అప్పుడే స్పష్టం చేశాడని ఆమె గుర్తు చేసుకుంది.