: వ్యక్తిగత విమర్శలపై జేపీ క్లాస్
అసెంబ్లీ నడుస్తున్నతీరుపై లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు ప్రజా సమస్యలను పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. బడ్జెట్ సమావేశాల మూడోరోజున ఆయన శాసనసభలో ఆవేశంగా మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి.. పేదలను పేదలుగానే ఉంచుతున్నారని జేపీ దుయ్యబట్టారు.
ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచేలా చర్యలు తీసుకోకుండా వారిని పేదరికంలోంచి బయటకు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం, నిరుద్యోగం, ఉపాధి వంటి విషయాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఆయన సూచించారు.
ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచేలా చర్యలు తీసుకోకుండా వారిని పేదరికంలోంచి బయటకు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం, నిరుద్యోగం, ఉపాధి వంటి విషయాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఆయన సూచించారు.