: మద్దతివ్వవద్దని సుష్మాస్వరాజ్ ను కోరతాం: సబ్బం హరి
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని బీజేపీ నేత సుష్మస్వరాజ్ ను కోరతామని ఎంపీ సబ్బం హరి తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, విభజన బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని ఆమెకు విజ్ఞప్తి చేస్తామన్నారు. రాజకీయలబ్ది కోసమే విభజన బిల్లును తెచ్చారని చెప్పిన బీజేపీ అగ్రనాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అందరూ వ్యతిరేకిస్తున్న విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి ఆలోచించాలని ఆయన కోరారు.
తన మాట వినకపోవడం వల్లే సాక్షి సర్క్యులేషన్ 7 లక్షలకు పడిపోయిందని అన్నారు. తానెప్పుడూ జగన్ ను ఎంపీ సీటు కోరలేదని స్పష్టం చేశారు. తనను విమర్శించిన వారిని తాను విమర్శించనని అన్నారు. వెయ్యి మంది మీటింగ్ కు వస్తే 5 వేలుగా చూపడం సాక్షి టీవీకి బాగా అలవాటైపోయిందని ఆయన విమర్శించారు. దిష్టిబొమ్మలు తగులబెట్టడాన్ని అవుట్ సోర్సింగ్ కు ఇస్తే మరిన్ని ఎక్కువ దిష్టిబొమ్మలు తగులబెడతారని ఆయన సూచించారు.