: భారీ స్కోరు దిశగా భారత్
ఓపెనర్ల బ్యాటింగ్ విధ్వంసంతో భారత్.. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి టెస్టులోనే శతకం బాది ప్రపంచ రికార్డు సాధించిన కొత్త ఓపెనర్ శిఖర్ ధావన్.. సెంచరీ పూర్తయినా తన జోరు తగ్గించలేదు. కంగారూ బౌలర్లను ఆటాడుకుంటున్న ధావన్ ప్రస్తుతం 163 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఈ క్రమంలో ధావన్.. అలనాటి వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ గుండప్ప విశ్వనాథ్ ‘(137) రికార్డును అధిగమించాడు. కెరీర్ తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మన్ గా చరిత్రకెక్కాడు. ఇక, మరో ఓపెనర్ విజయ్ (69) నిలకడ ప్రదర్శించడంతో భారత్ వికెట్ నష్టపోకుండా 245 పరుగులు చేసింది.