: ముఖ్యమంత్రుల మాటవిన్న ఐఏఎస్ లు జైలుపాలయ్యారు: వీహెచ్


ముఖ్యమంత్రుల మాటలు యథాతథంగా విన్న ఐఏఎస్ అధికారులంతా జైళ్లపాలయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హెచ్చరించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, స్వయం ఉపాథి అర్హతను 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచి సీఎం మైనారిటీలకు, యువకులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. సీఎం మాట విని జైలుపాలయ్యే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చూసుకోవాలని సూచించారు. ఢిల్లీలో అధిష్ఠానానికి చూపించేందుకు మొహం చెల్లకే కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ సదస్సుకు రాలేదని అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని వీహెచ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News