: రాజకీయాల్లో ఉన్నత లక్ష్యం నేరం కాదు: అద్వానీ
రాజకీయాల్లో ఉన్నత లక్ష్యాలు నేరం కాదని బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీని ప్రధానిగా చూడాలని బీజేపీతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారిలో పేరుకున్న అభద్రతా భావాన్ని వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి తనకెంతో ఆనందంగా ఉందని అద్వానీ హర్షం వ్యక్తం చేశారు.