: రాష్ట్రం విడిపోదు.. సీఎం కొత్తపార్టీ పెట్టరు: ఆనం


రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో వెలుస్తున్న ఫ్లెక్సీలు, నినాదాలు, ప్రకటనలు చూస్తుంటే ఎవరో కొత్త పార్టీ పెడుతున్నారనే అనుమానం కలుగుతోందని అన్నారు. 'మీరు పార్టీ మారుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయన్న' ప్రశ్నకు... 'అవన్నీ ఉత్తి పుకార్లే'నని ఆయన ఖండించారు.

  • Loading...

More Telugu News