: పఠాన్ పెళ్లి... మోడీకి ఆహ్వానం
విధ్వంసక బ్యాట్స్ మన్ యూసుఫ్ పఠాన్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. బంతిని అలవోకగా బౌండరీలు దాటించే ఈ బరోడా హార్డ్ హిట్టర్ మార్చి 27న ఓ ఇంటి వాడు అవుతున్నాడు. వధువు బరోడాకు చెందిన ఫిజియోథెరపిస్ట్ అఫ్రీన్. కాగా, సాధారణంగా క్రికెటర్ల వివాహ వేడుకలకు దూరంగా ఉండే గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ.. యూసుఫ్ పెళ్లికి వచ్చేందుకు ఓకే చెప్పాడట.
యూసుఫ్ సోదరుడు, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ శుక్రవారం స్వయంగా వెళ్ళి మోడీని ఆయన చాంబర్లో కలిసి వివాహానికి ఆహ్వానించాడు. ఇర్ఫాన్ ఆహ్వానాన్ని మోడీ వెంటనే మన్నించాడని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.