: బస్సు బీభత్సం... మూడు బైక్ లు ధ్వంసం
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఆర్టీసీ బస్సు విధ్వంసం సృష్టించింది. నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎల్బీనగర్ చింతలకుంట జాతీయ రహదారిపైనున్న చెక్ పోస్టు వద్దకు రాగానే బ్రేక్స్ ఫెయిలై ఎదురుగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి వాహన రాకపోకలు పునరుద్ధరించారు.