: రాజకీయ పార్టీ ఉద్యమానికి.. ప్రజా ఉద్యమానికి తేడా తెలియదా?: డాక్టర్ మిత్రా
తెలంగాణ ఉద్యమం ప్రజాఉద్యమం కాదని, ఓ రాజకీయ పార్టీ చేసిన ఉద్యమమని పీఆర్పీలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ మిత్రా అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగు ప్రజావేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద సామూహిక సమైక్యదీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్థి కోసం ఉన్నవీ లేనివీ చెప్పి..విద్యార్థులను రెచ్చగొట్టి సీట్లు కొల్లగొట్టేందుకు ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. వాస్తవాలు చెప్పాలని ప్రయత్నించిన అందరిపై దాడులు చేసి, భయపెట్టి వారి వాదనలు నిజాలని చెప్పేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల లాభంకంటే నష్టమే అధికంగా ఉంటుందని సూచించారు. మేధావులకు రాజకీయ పార్టీ ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి తేడా తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.