: సిరివెన్నెలకు ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం
ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం దక్కింది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నిన్న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఎన్టీఆర్ విజ్ఞాన్ సంస్థ దీన్ని సిరివెన్నెలకు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో సీ నారాయణ రెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు.