: లోక్ సత్తా ఆమ్ఆద్మీలో విలీనం కావాల్సిందే: ప్రశాంత్ భూషణ్


ఎన్నికల్లో ఏ పార్టీతోనూ ఆమ్ ఆద్మీ పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ జాతీయ నేత ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో ప్రశాంత్ భూషణ్ మాట్లాడారు. రాష్ట్రంలో లోక్ సత్తా పార్టీతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. కానీ, ఆ పార్టీ ఆమ్ ఆద్మీలో విలీనం కావాల్సిందేనని, తామెవరితోనూ పొత్తుపెట్టుకునేది లేదన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు విడివిడిగా ఎన్నికల ప్రచార కమిటీలు ఉంటాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవినీతిమయమేనని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News