: కొత్తింట్లోకి మారిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు కేటాయించిన కొత్త భవంతిలోకి మకాం మార్చారు. పలు భద్రతా సమస్యలు ఏకరువు పెడుతూ ఢిల్లీ పోలీసులు పలుమార్లు ఆయనకు అధికారిక నివాసంలోకి మారాలని సూచించారు. ఎట్టకేలకు భద్రతాధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేజ్రీవాల్ తిలక్ లేన్ లోని మూడు పడకల నివాసంలోకి మారిపోయారు. గతంలో 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అధికారిక విధులను నెరవేర్చిన కేజ్రీవాల్, నేటి నుంచి నూతన నివాసం నుంచి విధులకు హాజరవుతున్నారు.