: ఆటో డ్రైవర్ల సమ్మెతో సికింద్రాబాదులో ప్రయాణికుల పాట్లు


హైదరాబాదు నగరంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఆటో డ్రైవర్ల సమ్మెతో జంట నగరాల్లో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులను పూర్తి చేసుకుని సికింద్రాబాదు స్టేషన్ లో అడుగుపెట్టిన ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం. చేసేది లేక పలువురు లగేజిని మోసుకొని సిటీ బస్టాండ్ వరకు వెళ్లడం కనిపించింది. మరికొందరు ప్రైవేటు వాహనాలు, క్యాబ్ లను ఆశ్రయించారు. అలాగే ఉదయం వేళ పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. వారాంతంలోనే ఆర్టీసీ బస్సులు రద్దీగా మారడంతో.. మరో రెండు రోజులు ఆటోల సమ్మె కొనసాగితే జంట నగరాల ఉద్యోగులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు.

  • Loading...

More Telugu News