: విశాఖ నుంచే పోటీ చేస్తా: పురంధేశ్వరి


రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచే తాను పోటీ చేస్తానని కేంద్ర మంత్రి పురంధేశ్వరి స్పష్టం చేశారు. విశాఖ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు పురంధేశ్వరి, టీ సుబ్బరామిరెడ్డి పోటీ పడుతున్నారు. దీని కారణంగా గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక దశలో వీరు బహిరంగ విమర్శలకు కూడా దిగారు.

విశాఖ నుంచి బరిలో దిగేందుకు టీఎస్సార్ అన్ని వనరులు సమకూర్చుకుంటున్నారు. దీనిపై ఆయన ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాజాగా పురంధేశ్వరి కూడా విశాఖ నుంచే బరిలో దిగుతానంటూ స్పష్టం చేయడంతో ఈ స్థానంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. హైదరాబాదులో ఓ రెస్టారెంట్ ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం ఆతిథ్యరంగమని అన్నారు. ఆతిథ్యరంగం వల్ల యువత విదేశాలకు వెళ్లకుండా ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News