: హైదరాబాదులో ఆమ్ ఆద్మీ కార్యకర్తలతో ప్రశాంత్ భూషణ్ భేటీ
హైదరాబాదు, దోమలగూడలోని ఏవీ కళాశాలలో ఆమ్ ఆద్మీ కార్యకర్తలతో ఆ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ ఇవాళ (శనివారం) సమావేశమయ్యారు. పంజాగుట్టలో ఏఏపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవాన్ని చేసిన ప్రశాంత్.. అనంతరం కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని ఆయన చేసిన ప్రకటనతో ఏఏపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రకు చెందిన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఏఏపీ కార్యకర్తల భేటీ రసాభాసగా ముగిసింది.