: ఖమ్మం జిల్లాలో ఆర్మీ రిక్రూట్ మెంట్
ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలో సైనికుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్ మెంట్ కు తెలంగాణలోని పది జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. ఇవాళ జరిగిన సోల్జర్ టెక్నికల్ కేటగిరిలో 3,175 మంది ఇంటర్మీడియట్ (ఎంపీసీ) విద్యార్థులు పాల్గొన్నారు. అర్హులైన వారికి పరుగు పందెం పోటీలను పెట్టిన అధికారులు.. పోటీలో అర్హులైన వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం 600 మంది పోలీసు సిబ్బంది, 115 మంది సైనిక సిబ్బందితో పాటు సుమారు 180 మంది వరకూ సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. ఈ నియామక ప్రక్రియను ఖమ్మం జిల్లా ఎస్పీ రంగనాథ్ పర్యవేక్షించారు.