: సునందా పుష్కర్ ది అసాధారణ మృతి: ఎయిమ్స్ వైద్యులు
కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి అసాధారణమేనని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ముగ్గురు సభ్యులతో కూడిన వైద్య బృందం ఆమె మృత దేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం నివేదిక విడుదల చేశారు. సునంద శరీరంపై గాయాలున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఆమె విషం తీసుకున్న ఆనవాళ్లేమీ కనిపించలేదని డాక్టర్లు స్పష్టం చేశారు.