: మోడీ ప్రధాని కాకుండా ఉండేందుకే కుట్ర: రాజ్ నాథ్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ భారత ప్రధాని కాకుండా ఉండేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల మయమయిందని ఆయన అన్నారు. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడ్డా.. తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తామని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.