: ముఖ్యమంత్రులను ఇచ్చినా రాయలసీమకు శాపమే: జేపీ


రాష్ట్రానికి రాయలసీమ ముఖ్యమంత్రులను ఇచ్చిందని, అయినప్పటికీ ఆ ప్రాంతం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని జయప్రకాశ్ నారాయణ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ... విద్య, వైద్యం, గుజరాత్ కంటే కూడా వర్షపాతం ఎక్కువున్నా మంచినీరు రాయలసీమలో దొరకడం లేదని అన్నారు. మరుగుదొడ్లు కూడా లేవని, పేదరికంలో మగ్గుతున్న ప్రాంతం రాయలసీమ, తలసరి ఆదాయంలో కూడా రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతోందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటుంటే రాయలసీమ ప్రాంతానికి నిధుల లేమి ఉందని జేపీ తెలిపారు.

  • Loading...

More Telugu News