: సునందకు తీవ్రమైన అనారోగ్య సమస్యల్లేవు: వైద్యులు


అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందకు ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు ప్రకటించారు. తిరువనంతపురంలోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్)లో సునందా పుష్కర్ ఈ నెల 13, 14 తేదీల్లో పలు పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో ఆమె వెంట థరూర్ కూడా ఉన్నారు. సునంద మరణవార్త నేపథ్యంలో ఆమెకు లోగడ నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి అనారోగ్యం లేదని కిమ్స్ వైద్యులు తాజాగా ప్రకటించారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆమె వచ్చారని, సాధారణ మందులు సూచించి.. సునందను పంపించివేశామని కిమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయరాఘవన్ తెలిపారు. వైద్యపరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఆ వివరాలను దర్యాప్తు అధికారులకు అందిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News