: హైదరాబాదులో రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృత్యువాత


హైదరాబాదు నగరంలో ఇవాళ (శనివారం) మధ్యాహ్నం రైలు ఢీకొని తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. లాలాపేటలోని వంతెన కింద వారు రైలు పట్టాలు దాటుతుండగా.. అటు నుంచి వేగంగా వస్తున్న రైలు ఢీకొనటంతో ఈ దారుణ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులిద్దరూ సంఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడవటంతో.. అది చూసిన వారు చలించిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, వారి భౌతిక కాయాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News