: కేంద్ర మంత్రి శశి థరూర్ ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించే అవకాశం?
భార్య సునందా పుష్కర్ అంత్యక్రియలు ముగిశాక కేంద్ర మంత్రి శశి థరూర్ ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా థరూర్, పుష్కర్ మధ్య జరిగిన పలు విషయాలపై పోలీసులు ఆరా తీయనున్నారని తెలిసింది. ఇదే సమయంలో ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు. కొన్ని నెలల నుంచి థరూర్, సునంద మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలు వెలువడిన విషయం విదితమే.