: సాయంత్రం 4 గంటలకు సునందా పుష్కర్ అంత్యక్రియలు
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అంత్యక్రియలు ఈ సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్నాయి. ఢిల్లీలోని లోథీ రోడ్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆమె మృత దేహానికి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.