: ఇండిగో విమానం హైదరాబాదులో అత్యవసర లాండింగ్


బ్యాంకాక్ నుంచి బయల్దేరిన ఇండిగో విమానం ఇవాళ (శనివారం) ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి కోల్ కతా వెళ్తున్న ఈ విమానం మార్గమధ్యంలో ఇక్కడ సాంకేతిక కారణాల వల్ల ఆగినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కోల్ కతా ఎయిర్ పోర్టులో అలముకున్న దట్టమైన పొగమంచు వల్ల ల్యాండింగ్ కు అనుకూలించలేదని.. అందుకే అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ ఆపివేసినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కొద్దిసేపటి క్రితమే కోల్ కతాకు బయల్దేరి వెళ్లిందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News