: పెద్దగా ప్రయోగాల జోలికెళ్లం: ధోనీ


న్యూజిలాండ్ తో ఐదు వన్డేల సిరీస్ లో భారీ ప్రయోగాల జోలికెళ్లబోమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ అన్నారు. కొంత మంది ఆటగాళ్లకు ప్రస్తుత సిరీస్ చక్కటి అవకాశంగా అభివర్ణించాడు. 'ఇప్పటికే ప్రయోగాలు చేసి ఉన్నాం. ఇక పెద్దగా మార్పులు చేయం. తామేంటో నిరూపించుకోవడానికి కొంతమందికి అవకాశమిచ్చి చూస్తాం' అని ధోనీ నేపియర్ లో మీడియాకు తెలిపారు. రానున్న వన్డే ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నందున.. ప్రస్తుత సిరీస్ అనుభవం సాధించడానికి మంచి అవకాశంగా చెప్పాడు. న్యూజిలాండ్ గడ్డపై గతంలో ఆడని వారికి ఇదొక అవకాశమన్నాడు. ముఖ్యంగా కొత్త బౌలర్లను ఉదాహరణగా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News