: మచిలీపట్నంలో అనూహ్యకు బంధుమిత్రుల తుది వీడ్కోలు
కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య అనుకోని రీతిలో ముంబైలో హత్యకు గురైన విషయం తెలిసిందే. టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అనూహ్య క్రిస్మస్ సెలవులకు సొంతూరికి వచ్చి ముంబైకి తిరుగు పయనమైంది. అయితే.. ఆ తరువాత ఆమె అనుమానాస్పద రీతిలో దుర్మరణం పాలైంది. ఈ కేసును రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం అనూహ్య భౌతికకాయం మచిలీపట్నానికి చేరింది. ఆమె అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులతో పాటు అనూహ్య స్నేహితులు, బంధువులు ఆమెకు తుది వీడ్కోలు పలికారు. అయితే.. ఆమె మరణానికి దారి తీసిన ఘటనేమిటో ఇంకా తేలాల్సి ఉంది. ముంబైలో ఆమె అదృశ్యానికి క్యాబ్ డ్రైవరే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.