: ఎన్టీఆర్ లేనందుకే రాష్ట్రానికీ దుస్థితి: లక్ష్మీపార్వతి


నట సార్వభౌమ నందమూరి తారక రామారావు లేకపోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఆయన భార్య నందమూరి లక్ష్మీపార్వతి ఆవేదనతో చెప్పారు. ఇవాళ (శనివారం) ఎన్టీఆర్ 18వ వర్థంతి సందర్భంగా ఆమె హైదరాబాదు, ఎన్టీఆర్ మార్గ్ లోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. నటనలోనే కాదు, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారని ఆమె తెలిపారు. ఆ మహావ్యక్తి జీవించి ఉంటే.. ఇప్పుడు తెలుగువారంతా ఒక్క తాటిపైనే ఉండేవారని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలు చేసి వారి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆమె పేర్కొన్నారు. అయితే ఆయన నుంచి అధికారం లాక్కున్న వారు నేడు రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News