: కర్ణాటక పోలీసుల కస్టడీకి యాసిన్ భత్కల్
ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను కర్ణాటక పోలీసుల కస్టడీకి ఎన్ఐఏ అప్పగించింది. 2010, ఏప్రిల్ 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో భత్కల్ ను విచారించేందుకు తమకు అప్పగించాలని కోరడంతో ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ జడ్జి అనుమతించారు. ఈ నెల 28 వరకు వారి కస్టడీలోనే ఉంటాడు.