: రాహుల్ అడిగితే.. కాదంటారా?
రాహుల్.. కాంగ్రెస్ యువరాజు, భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థి. ఆయనేదైనా అడిగితే కాదనగలరా? సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను పెంచాలని నిన్న జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ సభాముఖంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. ఆ వెంటనే.. వచ్చే వారంలో కేబినెట్ సమావేశంలో సబ్సిడీ సిలిండర్లను 12కు పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. నిర్ణయం తీసుకోవడం ఇక లాంచనమేనని సమాచారం. 9 సబ్సిడీ సిలిండర్లతో సామాన్యులు వంట చేసుకోలేకున్నారని, ఆ సంఖ్యను పెంచాలని రాహుల్ నిన్నటి సమావేశంలో కోరారు. ఇదంతా ఎన్నికల్లో గెలుపుకోసం డ్రామాలేనని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ విమర్శించారు.