: చర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ.. ప్రసంగించిన భూమన


శాసనసభలో టీబిల్లుపై వైఎస్సార్సీపీ తొలిసారి చర్చలో పాల్గొంది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బిల్లుపై ప్రసంగించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, విభజనకు సహకరిస్తున్నారంటూ తమ పార్టీపై నిందలు మోపుతున్నారని అన్నారు. విభజన జరిగితే తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. సమైక్యరాష్ట్రానికి టీడీపీ కట్టుబడి ఉన్నట్లయితే... చంద్రబాబుతో ప్రకటన చేయించాలని కోరారు.

రాష్ట్ర సమైక్యత కోరుకున్న మొదటి వ్యక్తి వైయస్సే అని భూమన చెప్పారు. తెలంగాణకు మొదటి బీజం వేసింది రాజశేఖరరెడ్డే అని అనవసరంగా ఆయనపై నిందారోపణలు వేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల మేలు కోసమే తాము సమైక్యవాదాన్ని వినిపిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన జరుగుతోందనగానే మొదట స్పందించింది వైఎస్సార్సీపీనే అని చెప్పారు. తమ పార్టీ సభ లోపల, బయట ఒకే విషయం చెబుతోందని అన్నారు. సమైక్య తీర్మానం కోసం మొదటి నుంచి పట్టుబడుతున్నది తమ పార్టీనే అని చెప్పారు.

  • Loading...

More Telugu News