: కేంద్ర సర్కారుకు కేజ్రీవాల్ డెడ్ లైన్


తమ కేబినెట్ మంత్రి సోమ్ నాథ్ భారతితో వాదనకు దిగిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ కేంద్ర హోంమంత్రి షిండేకు అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే నిరసన ప్రదర్శనకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ న్యాయవిచారణకు ఆదేశించారు. ఢిల్లీలో స్థానికులతో కలిసి న్యాయమంత్రి సోమనాథ్ భారతి అర్ధరాత్రి వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేయడానికి వెళ్లిన మరుసటి రోజే కేజ్రీవాల్ ఈ మేరకు డిమాండ్ చేయడం విశేషం. ఢిల్లీలో శాంతి భద్రతల అధికారాలు కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండడమే సమస్యకు కారణమవుతున్నది. తమపై ఢిల్లీ సర్కారుకు అధికారాలు లేకపోవడంతో పోలీసులు మంత్రులు, వారి ఆదేశాలను లక్ష్యపెట్టడం లేదు.

  • Loading...

More Telugu News