: 610 జీవో అవసరం లేదని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పలేదా?: శైలజానాథ్


శాసనసభలో ఈ రోజు కూడా మంత్రి శైలజానాథ్ టీబిల్లుపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. గతంలో 610 జీవో అవసరం లేదని కేసీఆర్ చెప్పలేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆరు సూత్రాల అంశంపై సభలో కేసీఆర్ ఏమి మాట్లాడారో సభ్యులకు తెలియదా? అని అన్నారు. ఏ నిబంధన ప్రకారం హైదరాబాదును ఉమ్మడి రాజధాని చేయాలనుకుంటున్నారో బిల్లులో క్లియర్ గా పేర్కొనలేదని చెప్పారు. బిల్లును చూస్తుంటే రాజ్యాంగంతో మన రాష్ట్రానికి సంబంధం లేదా? అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే... ఇక్కడ ఉండే సీమాంధ్రులు అద్దెకు ఉండేవాళ్లా? అంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News