: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన హరికృష్ణ
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 18 వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో పెట్టినప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని అయన ఎప్పుడూ ఆరాటపడేవారన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. తెలుగు ప్రజల ఆవేదనకు అనుగుణంగానే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. రాజకీయ స్వార్ధంతో ఎవరికి వాళ్లు రాష్ట్రాన్ని విడగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.