: 27 తరువాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కవ్
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) యాజమాన్యంతో కార్మిక సంఘాలైన ఈయూ, టీఎంయూ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మధ్యంతర భృతి పెంచాలంటూ యాజమాన్యంతో పలుమార్లు చర్చించినా పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 46 శాతం ఐఆర్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. 27వ తేదీ నుంచి సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్మికులకు ఈయూ, టీఎంయూ నేతలు పిలుపునిచ్చారు. ఐఆర్ పెంచకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.