: సంచలన విజయం సాధించిన భారత్
ప్రపంచ హాకీ లీగ్ వర్గీకరణ అంతిమ పోరులో సంచలన విజయం నమోదైంది. ప్రపంచ నెంబర్ వన్ జర్మనీపై భారత హాకీ జట్టు తిరుగులేని విజయం సాధించింది. అటాకింగ్ గేమ్ లో తిరుగులేని జట్టుగా మన్ననలందుకున్న జర్మనీ ఫేవరేట్ గా జరిగిన పోరులో భారత ఆటగాళ్లు అనితరసాధ్యమైన పోరాటపటిమతో ఘన విజయాన్ని అందుకున్నారు. 5-4 గోల్స్ తేడాతో జర్మనీపై భారత్ విజయఢంకా మోగించింది.