: ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విన్


బ్రిస్బేన్ లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా ఉత్కంఠభరిత విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోరు సాధించింది. మోర్గాన్ 99 బంతుల్లో 106 (4 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులతో సెంచరీ చేశాడు. ఇయాన్ బెల్ (68), బట్లర్ (49)లు ఇంగ్లండ్ స్కోరు పెంచడంలో తమ వంతు కృషి చేశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాట్స్ మెన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. అయితే మార్ష్ (55), మ్యాక్స్ వెల్ (54), బెయిలీ (24), హ్యాడిన్ (26)లు ఆసీస్ ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఈ క్రమంలో 41 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఆసీస్ 235 పరుగులు చేసింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన ఫాల్క్ నర్ ఒక్కసారిగా విధ్వంసం సృష్టించాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 69 పరుగులు సాధించి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. ఫాల్క్ నర్ ధాటికి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ విజయాన్ని అందుకుంది.

  • Loading...

More Telugu News