: ఆత్మస్తుతికే ఏఐసీసీ సమావేశాలు: సబ్బం హరి
ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఎంపీ సబ్బం హరి విరుచుకుపడ్డారు. ఈ సమావేశాలు కేవలం ఆత్మస్తుతి, వ్యక్తి పూజకు తప్ప దేనికీ పనికిరావని అన్నారు. సదస్సుకు హాజరైన వారికి కుర్చీలు చూపెట్టేవారు కూడా లేకుండా పోయారని తెలిపారు. ఏఐసీసీ సమావేశాలకు హాజరుకావడానికి తమకు ఎవరి అనుమతి అక్కర్లేదని చెప్పారు. మాకున్న హక్కుతోనే సమావేశాలకు వచ్చామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత తమ భవిష్యత్ వ్యూహాన్ని అమలుచేస్తామని చెప్పారు.